సీతారాముల కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
చూచువారలకు చూడముచ్చటట..పుణ్యపురుషులకు ధన్యభాగ్యమటా
భక్తియుక్తులకు ముక్తిప్రదమటా.. ఆ..ఆ..ఆ
భక్తియుక్తులకు ముక్తిప్రదమటా.. సురులను, మునులను చూడవచ్చునట
కళ్యాణం చూతము రారండి !
దుర్జనకోటిని దర్పమడంచగ..సజ్జనకోటిని సంరక్షింపగా
ధారుణి శాంతిని స్థాపన చేయగా..ఆ..ఆ..ఆ
ధారుణి శాంతిని స్థాపన చేయగా..నరుడై పుట్టిన పురుషోత్తమునీ..
కళ్యాణం చూతము రారండి !
దశరథరాజు సుతుడై వెలసీ..కౌశికు యాగము రక్షణ చేసీ
జనకుని సభలో హరువిలు విరచీ..ఆ..ఆ..ఆ
జనకుని సభలో హరువిలు విరచీ..జానకి మనసు గెలిచిన రాముని..
కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
సీతారాముల కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
సిరికళ్యాణపు బొట్టును బెట్టీ..బొట్టును బెట్టీ
మణిబాసికమును నుదుటను గట్టీ..నుదుటను గట్టీ
పారాణిని పాదాలకు బెట్టీ..ఆ..ఆ..ఆ
పారాణిని పాదాలకు బెట్టి.. పెళ్ళికూతురై వెలసిన సీతా..
కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
సంపగినూనెను కురులను దువ్వీ..కురులను దువ్వీ
సొంపుగ కస్తూరి నామము దీర్చి..నామము దీర్చి
చెంపగ వాసి చుక్కను బెట్టీ..ఆ..ఆ..ఆ
చెంపగ వాసి చుక్కను బెట్టీ..పెండ్లీ కొడుకై వెలసిన రాముని
కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
జానకి దోసిట కెంపుల ప్రోవై..కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాశై .నీలపు రాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా..ఆ..ఆ..ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా..శిరముల మెరసిన సీతారాముల
కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
4 comments :
నాకు బాగా నచ్చిన పాటల్లో ఇదొకటి.
పైన మీరు టైపించిన దానిలో రెండుమూడు తప్పులు ఉన్నాయి.
తెలుగు పాటలు బ్లాగులో ఈ పాట సాహిత్యం తెలుగులో ఇచ్చారు. చూడండి.
నాక్కూడా బాగా ఇష్టం ఈ పాట :)
ప్రెజెంటేషన్ చాలా బాగుంది!
@ వీవెన్ గారు థాంక్ యు అండి. మొత్తం పాట ఉన్న వీడియో దొరకలేదు దానితో confuse అయిపొయాను :-) ఇప్పుడు కరెక్ట్ చేసాను.
@ హర్ష థాంక్ యు :-)
Ee song lyrics&composition superbgaa untaayi:-):-)
Post a Comment