ఓ నిండు చందమామా



ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగా   సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ..…ఓ…. ఓ.. నిండు చందమామా


నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగా  సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ......ఓ నిండు చందమామా


దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే..
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగా  సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ....ఓ..నిండు చందమామా


                                                 బంగారు తిమ్మరాజు
                                                 కోదండపాణి
                                                 ఆరుద్ర
                                                 ఏసుదాస్

4 comments :

వేణూశ్రీకాంత్ said...

ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టని పాట, ఏసుదాస్ గారి గొంతు ఎంత బాగుంటుందో ఇందులో... థాంక్స్ ఫర్ పోస్టింగ్ శ్రావ్యా.

Sravya V said...

Thank you Venu gaaru !

nmrao bandi said...

వేణూ శ్రీకాంత్ గారితో యుగళం...

నా చిన్నప్పటి నుంచీ ఇప్పటి వరకు...
ఎప్పటికప్పుడు...మళ్ళీ మళ్ళీ...
విని...వింటూ...వినబోయే...
తీయని వలపు తేనెల పాట...
ఆగని జేసుదా గానామృత ఊట...

Sravya V said...

Thank you NM Rao gaaru :-)

Post a Comment