తీరిన మనోగతం అందెను పాశుపతం !!!!!!
పాశుపతం ??? బాబోయ్ ఇదేంటి ఎప్పుడో గూగుల్ ప్లస్ పోస్ట్ లో కోరుకున్న చిరు కోరిక అనుకోకుండా తీరటంతో ఏవేవో అతిశయోక్తి అలంకారాలు వచ్చేస్తున్నాయి నా కీ బోర్డ్ కి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి ఈ చీప్ కామెడీ కి సంబంధం లేదు కాబట్టి కాసేపు ఈ కామెడీ పక్క పెట్టి అసలు విషయం చెప్పేస్తాను.
***
'అత్తారింటికి దారేది' మూవీ ఆడియో రిలీజ్ అయిన రోజుల్లో, 'దేవ దేవం భజే' అనే అన్నమాచార్య వారి కీర్తన విని, ఇంత అందమైన కీర్తన మంచి క్లాసికల్ డాన్సు బాలే తో చూస్తే అందగత్తె మరింత వన్నెలద్దుకున్నట్టుగా ఉండదూ అనుకున్నాను. అప్పటి నుంచి ఆ పాటని లూప్ లో పెట్టి వేల సార్లు వినే ఉంటాను, కానీ మంచి క్లాసికల్ డాన్సు చూడాలన్న కోరిక మాత్రం తీరలెదు.
ఇప్పుడు.. ఇన్ని.. రోజుల తరవాత, దేవుడి దగ్గర సర్వ జనుల కోరికల చిట్టాలో నా కోరిక వంతు వచ్చినట్లుంది. అంతే, హైదరాబాద్ లో జరుతున్న 'Silicon Andhra International Kuchipudi Dance Convention' లో శోభా నాయుడి గారి disciples తో ఈ అద్భుతమైన డాన్సు బాలే ప్రదర్శించారు.
ఈ magnificent performance ని వర్ణించటానికి ఏ అలంకారాలు వాడినా మాటల్లో పెట్టటం కష్టం అందుకే నేను ఆ పని చేయకుండా ఆ బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ ఈ వీడియో లో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. శోభానాయుడు గారికి, వారి శిష్యులకి మెనీ థాంక్స్.
(కేవలం చివరి చరణం ఒక్కటే తీసుకుని ఈ డాన్సు compose చేసారు, పూర్తిగా వినాలంటే క్రింద MS సుబ్బులక్ష్మి గారి గొంతు నుంచి జాలువారిన అమృతధారల్లొ తడిచిపోవచ్చు)
పల్లవి:
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం
చరణము -1:
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజదీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం
చరణము -2:
నీలజీమూత సన్నిభశరీరం ఘనవి
శాలవక్శం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం
చరణము -3:
పంకజాసన వినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం
పూర్తిగా MS సుబ్బులక్ష్మి గారి heavenly వాయిస్ నుంచి..
8 comments :
Good one Sravya.. Thanks for sharing :-)
అద్భుతం శ్రావ్యగారు, శివధనుర్భంగ, రామరావణయుద్ధం, మొదట్లో చివర్లో సీతారామలక్ష్మణ, ఆంజనేయమూర్తులవలె నిలిచిన దృశ్యం. అన్నీ ఒడలు పులకరించే విధంగా జరిగిన ప్రదర్శన. అనేక ధన్యవాదాలు మీకు.
శోభానాయుడుగారికీ వారిశిష్యులకీ సాటిలేదు. మొన్నే వివిధభారతిలో వారి తో సంభాషణ విన్నాను. చాలా సంతోషం.
@ వేణు గారు, @ లక్ష్మీదేవి గారు,
Pleasure is mine అండి. నాతోపాటు మీకు కూడా ఈ ప్రదర్శన నచ్చినందుకు చాలా చాలా సంతోషం గా ఉందండి.
Thank a lot for your valuable comments.
Thank you Sravya garu for sharing such a wonderful post. I have written the article based on the song from Attarantiki Daredhi. At that time I haven't really focused on the original song from MS Subhhalakhsmi. Double thanks for the video. మంచి సంగీతం ఎప్పుడు శ్రావ్యం గానే ఉంటుంది..:)
Here is my post http://www.maverickvajra.blogspot.com/2013/10/deva-devam.html
@Vajra gaaru Thank you :-)
Ayyo. I cant see the dance video. Em cheyyanu ? Any way nice to see u after a loooooooooooooong time andi.
@Sujatha gaaru
try this link
https://www.youtube.com/watch?v=95kN8Zhz4jA#t=8216
Thank you :-)
kannula panduvugaa vundi presentation.
Nitya
Post a Comment