నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు


నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమైతానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మయై యుండు సం-
స్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు||        ||నిత్యాత్ముడై యుండి||
యేమూర్తి లోకంబు లెల్ల నేలెడు నాత
డే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత
డే మూర్తి నిజమోక్ష మియ్యజాలెడు నాత
డే మూర్తి లోకైక హితుడు||               ||నిత్యాత్ముడై యుండి||
యే మూర్తి నిజమూర్తి యేమూర్తి యునుగాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైన యాత
డేమూర్తి సర్వాత్యుడేమూర్తి పరమాత్ము
డామూర్తి తిరు వేంకటాద్రి విభుడు||       ||నిత్యాత్ముడై యుండి|
|
యేదేవు దేహమున నిన్నియును జన్మించె
నేదేవు దేహమున నిన్నియును నఱగెమరి
యేదేవు విగ్రహంబీ సకల మింతయును
యేదేవు నేత్రంబు లిన చంద్రులు||         ||నిత్యాత్ముడై యుండి||
యేదేవుడీ జీవులన్నింటిలో నుండు
నేదేవు చైతన్య మిన్నిటికి నాధార
మేదేవుడవ్యక్తుడే దేవుడద్వంద్వుం
డాదేవుడీ వేంకటాద్రి విభుడు||            ||నిత్యాత్ముడై యుండి||
1 comments :

LyricsMyLife said...

Very nice.
Visit the best lyrics sure:-LyricsMyLife!

Post a Comment