స్వాతి కిరణం నుంచి
సంగీత సాహిత్య సమలంకృతే
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతీ మనసా స్మరామి
హే భారతి మనసా స్మరామి
శ్రీ భారతీ శిరసా నమామి
శ్రీ భారతి శిరసా నమామి
సంగీత సాహిత్య సమలంకృతే……….
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిణి
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిణి
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞ్యానవల్లీ సవుల్లాసిని.......
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే……….
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి ....
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని
సకల సు కళా సమున్వేషిణి
సకల సు కళా సమున్వేషిణి
సర్వ రస భావ సంజీవినీ
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతీ మనసా స్మరామి
శ్రీ భారతీ శిరసా నమామి
సంగీత సాహిత్య సమలంకృతే……….
అభేరీ రాగం (ఖరహరప్రియ జన్యరాగం ) లో చేసిన ఈ పాట ను మురిపించే మువ్వలు సినిమా కోసం జానకి గారు పాడారు. ఈ వీడియో లో చిట్టితల్లి కూడా అంత కష్టమైన పాటని ఎంత ముచ్చట గా పాడిందో చూడండి .
ఎప్పుడు చూసిన పాత పాటలేనా హు అనుకునే కొత్త పాటల ప్రియుల కోసం ఖరహర ప్రియరాగం లోనే చేసిన ఈ పాట
(Credits : Original video uploaders)
ఇదే రాగం లో చేసిన మరికొన్ని పాటలు నెక్స్ట్ పోస్టులో విందాం , అందాకా ఉంటూనే ఉండండి మీకు నచ్చిన పాటలు ఈ మన బ్లాగులో ........................:)
8 comments :
రాగాలు గుర్తు పెట్టుకోటానికి ఏమన్నా చిట్కాలు ఉన్నాయా ? సంగీతం నేర్చు కోవాలసిన్దేనా? థాంక్స్ ఫర్ పోస్టింగ్.
రాజు గారు ముందు గా ధన్యవాదాలు , సంగీతం నేర్చుకోకపోయినా మీరు ఆ రాగాలని తెలుసుకొని వినటం ద్వారా గుర్తు పట్టొచ్చు . కాని పాత సినిమా పాటలు , క్లాసికల్ మ్యూజిక్ ని మీరు ఇలా గుర్తు పట్టటం ఈజీ , కొత్త సినిమా పాటలు కష్టం వీటిల్లో మనకు ఆ రాగాచ్చాయలు మాత్రమే కనిపిస్తాయి అందుకే confuse అవటానికి అవకాశం ఉంటుంది .
ఆసక్తికరమైన సమాచారం శ్రావ్యగారు. పంచుకున్నందుకు ధన్యవాదాలు.
బాబోయ్ కిలిమంజారో లో మొదట వచ్చే ఆ మ్యూజిక్ చూసి అది ఆఫ్రికన్ వాళ్లదేమో అనుకున్నా..లిరిక్స్ కాస్త ఎంచుకోండి
అది ఖరహరప్రియ రాగమా
పాడుతా తీయగా లో ఆ అమ్మాయి బాగా పాడింది
ఇదే రాగం లో చేసిన మరికొన్ని పాటలు నెక్స్ట్ పోస్టులో విందాం..విందాం విందాం :)
అందాకా ఉంటూనే ఉండండి మీకు నచ్చిన పాటలు ఈ మన బ్లాగులో మెరుగైన మ్యూజిక్ కోసం :)
అందాకా ఉంటూనే ఉండండి మీకు నచ్చిన పాటలు ఈ మన బ్లాగులో మెరుగైన మ్యూజిక్ కోసం :)
STAY TUNED.........
@వేణు గారు Thank you !
హరేకృష్ణ గారు మన బ్లాగులో మెరుగైన మ్యూజిక్ కోసం :) అవును Thank you !
లిరిక్స్ కాస్త ఎంచుకోండి
-------
ఇదేంటో అర్ధం కాలేదు అంటే కొంచెం మంచి పాటలు పెట్టమనా ?:)
శ్రీనివాస్ పప్పు గారు Thank you :)
ఆసక్తికరమైన సమాచారం శ్రావ్యగారు thanks alot.
http:/kallurisailabala.blogspot.com
శైలబాల గారు Thank you !
Post a Comment