ఈ పాట పాడిన గాయని గురించి తెలియని నవతరం యువతి యువకులారా ఇక్కడ చదివి తెలుసుకోమని మనవి :)
మా తెలుగుతల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
।।మా తెలుగు।।
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
।।మా తెలుగు।।
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!
-- శ్రీ శంకరంబాడి సుందరాచారి.
25 comments :
పాట విన్నప్పుడల్లా పాట వ్రాసిన శ్రీ శంకరంబాడి సుందరాచారి గారి మీద మధురాంతకం రాజారాం గారి వ్యాసం గుర్తుకొచ్చి బాధగా ఉంటుంది.
థాంక్స్ ఫర్ ది పోస్ట్.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..
మంచి పోస్ట్..
ధన్యవాదములు..
--
HarshaM
శబ్భాష్ శ్రావ్యా,
సందర్భానికి అనుగుణంగా మంచి పాట పెట్టారు. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎంత ద్వేషించినా, ఈమె మా తల్లి కాదన్నా, తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగుకు ఒక్కటే తల్లి. ఆ తల్లికి మల్లెపూదండలూ, మంగళారతులూ అందిస్తూనే ఉందాం!
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..
మంచి టపా.
ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
రావు గారు ఆ వ్యాసం ఏంటి ? కొంచెం వివరాలు ఇవ్వగలరా ? నాకు దీని వివరాలు ఏమి తెలియవండి :( . ఈ పోస్టు నచ్చిందుకు ధన్యవాదాలు !
సుజాత గారు అంటే కదా ఎవరెన్ని విద్వేషాలు రగిల్చినా తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగుకు ఒక్కటే తల్లి ! ధన్యవాదాలు !
హర్ష , వేణు గారు , బంతి ధన్యవాదాలు మీకు ఈ పోస్టు నచ్చిందుకు .
రావు లక్క రాజు గారు ఆ వ్యాసం మీ వద్ద ఉందా ? విషయం నాకు తెలుసు కానీ నేను చదివింది గొల్లపూడి మారుతీరావు గారు రాసిన వ్యాసం అని గుర్తు . ఆ పాట రాసిన సుందరాచారి గారు చివరి రోజుల్లో తిరుపతిలో దయనీయమైన జీవితం గడిపారు . ఆ పాటను రాజకీయంగా ఒక పార్టీ వారు ఉపయోగించుకున్నారు కానీ సుందరాచారి గారి గురించి కానీ, ఆయన కుటుంబం గురించి కానీ పట్టించుకోలేదు
మురళి గారు ధన్యవాదాలు ! గొల్లపూడి వారు రాసారంటారా ఆ వ్యాసం ?
ఆ పాట రాసిన సుందరాచారి గారు చివరి రోజుల్లో తిరుపతిలో దయనీయమైన జీవితం గడిపారు .
-----------------------------------------------
అయ్యో ! ఇది తెలిసినాకా చాల బాధ వేస్తుందండి . కాని ఆ రోజుల్లో ఇలా సరస్వతీ పుత్రులకి పెద్ద గా డబ్బు చేసుకోవటం తెలియని రోజులు కదా :( . ఇలాంటి వ్యక్తి రాసిన పాటని ఇప్పుడు కూడా రాజకీయం చేసేవాళ్ళని చూస్తుంటే ఇంకా చిరాకు వేస్తుంది ఇది తెలుసిన తరవాత.
TS.కుమారి గారు పరవాలేదు, బాగానే పాడారు.
నవంబర్ రెండు, 2056 నుంచి ...
మా తెలంగాణ పిన్నికి బంతి బతుకమ్మ
మమ్ము తరిమిన పిన్ని పిల్లలకి మంగళారతులు
అని పాడుకోవాలేమో కదండి? :(
హ హ శంకర్ గారు ఎందుకు ? ఆ రోజు వాళ్లకి ప్రత్యెక రాష్ట్రం ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యారా ?
@బుద్దా మురళి, శ్రావ్య
శ్రీ శంకరంబాడి సుందరాచారి గారి మీద మధురాంతకం రాజారాం గారి వ్యాసం దాదాపు పది పదిహేను ఏళ్ళ క్రిందట ఒక వార పత్రిక లో అనుకుంటా చదివాను. నన్ను కొంచం కదిలించి వేసింది కాబట్టి గుర్తుంది.వ్యాసం దాచి పెట్టాను కానీ కనుపడుటలేదు. గొల్లపూడి మారుతీరావు గారు ఇంకొక వ్యాసం వారి మీద వ్రాసి ఉండచ్చు. వ్యాసం లో నాకు గుర్తున్న కొన్ని సంగతులు చెబుతాను.
చిత్తూరు దగ్గర అనుకుంటా మాస్టారు గా పనిచేశారు. తరువాత రాజారాం గారు పనిచేసే స్కూల్ ని ఇనస్పెక్టు చెయ్యటానికి వచ్చారు. ఆయన గురించి రాజారాం గారికి చాలా ఏళ్ళబట్టీ తెలుసు. తరువాత శంకరంబాడి గారు ఉద్యోగం మానేసి పుస్తకాల రచయితగా ఉందామని అనుకున్నారు కానీ పరిస్తుతులు అనుకూలించలేదు. తరువాత ఆయనకి ఆంధ్ర గవర్నమెంట్ పెన్షన్ లాంటిదేదో ఇచ్చింది. అప్పటికే ఆయన జీవితం చాలా మలుపులు తిరగటం తోటి నిస్పృహతో తాగుడు అలవాటయినది. ఇంక నేను వ్రాయలేను.
మన దేశ చరిత్రలో గోప్ప త్యాగాలు చేసినవారు, వారిని అంటిపెట్టుకుని జీవించిన వాళ్ళ జీవితాలు కొంచెం బాధాకరం గానే గడిచాయి. ఉదా: మన దేశ త్రివర్ణ పతాకం రూపొందించిన వారు, లెక్కలలో మన దేశ ప్రతిష్టను చాటిన రామానుజన్, మనకి 'మా తెలుగుతల్లి' పాట కూర్చిన శంకరంబాడి గారూ.
నేను మూడు వారాలు మా వూరు వదలి వెళ్తున్నాను. వచ్చిన తరువాత మనమేదన్నా చేద్దామంటే నేను రెడీ.
లక్కరాజు
రావు గారు హ్మ్ ! మ్మేరు ఊరు వెళ్లి రండి నేను ఈ లోపు ఈ వ్యాసం సంపాదించి చదవటానికి ప్రయత్నం చేస్తాను !
అయ్యా snkr గారు, ఇప్పుడు ఇక్కడెవరు తెలంగాణ గురించి, సోకాల్డ్ తెలంగాణ తల్లి గురించి మాట్లాడలేదే....at-least on this blog. అలాంటపుడు మీరు సందర్భం సంబంధం లేకుండా అలా వ్యాఖ్యానించడం బాగోలేదు.
..nagarjuna..
అయ్యా.... అయ్యయ్యా.... అనానిమస్ నాగార్జున గారు, తెలుగుతల్లి అంటే ప్రస్తుతానికి నాకు గుర్తువచ్చింది అరాచక తెలబాన్ల అసత్యప్రచారం, నీతిమాలిన ఉద్యమం. నా భావనలు మీకు కంటగింపుగా కలిగినందుకు నేనేమీ అనుకోవడం లేదు. :)
రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మీ అమూల్య అభిప్రాయాన్ని ఏమిటో సెలవియ్యండి, లేదా ఆ పై టపా మీద మీకు తోచింది వ్యాఖ్యానించండి, కామెంట్ల మీద తరువాత తీరిగ్గా చర్చిద్దాము. :P
hmm...తెలుగుతల్లి గురిచి మాట్లాడుతుంటే మీకు వేరెవరో ఎవరికోసమో సృష్టించుకున్న తల్లి ఎందుకు గుర్తుకొచ్చిందో అర్ధం కావట్లా.పోని తమరి దృష్టిలోని ’తెలబాన్లు’ ఎవరైనా ఇక్కడకు వచ్చి అనవసర కామెంట్లు వేసారాంటే అదీలేదు. బహుశా వాళ్లతో వాదించి దించి ఎక్కడ చూసినా వాళ్లె కనపదుతున్నారా !!
ఇక టపా మీద స్పందన అంటారా, ఆదరించడమూ సంతోషించడమూ జరిగిపోయాయిలెండి :)
గతితార్కికభౌతిక పరిస్థితులపై మీకు అంత అవగాహన వుంటే, తెలుగువారిచే రాజధానిలో బూతులతో అవమానించబడి, తెలుగుతల్లి సుపుత్రులైన మహనీయుల విగ్రహాలు ఆటవికంగా ధ్వసము చేయబడి దిగాలిగా అనిపించిన దీనస్థితిలోని తెలుగుతల్లి ఒకప్పటి కీర్తిని ప్రస్తుతించే ఈ పాట వింటే... తెలుగువాడైనందుకు అలా స్పందించాననుకోండి. మీరు కరడుగట్టిన తెలబాన్లు కాకపోయినా, మీరు 'విరోచన'కారుల సానుభూతిపరులనే విషయం నాకు గుర్తుంది. :) మీరొచ్చారుగా... అయినా, తెలబాన్లు వచ్చేదాకా నా ఆలోచనలను ఆపుకోవాలని సలహా ముసుగేసుకొచ్చి మరీ ఇచ్చారా?! హూ.. వూ... గట్లనే చేసుడుతాము.
/ఇక టపా మీద స్పందన అంటారా, ఆదరించడమూ సంతోషించడమూ జరిగిపోయాయిలెండి :)/
ఏదీ ఎక్కడ? లోలోపలనా? ఏదీ, నాతో ఇన్ని మాటలు ఓపిగ్గా చెప్పారు, తెలుగుతల్లి గురించి తెలబాన్లకు వెరవకుండా అన్నే మాటలు చెప్పండి, చూద్దాం. నోరు పెగలడం లేదు కదా? ... అదంతే! అర్థమయ్యింది లేండి. :D
Snkr.
/ఇక టపా మీద స్పందన అంటారా, ఆదరించడమూ సంతోషించడమూ జరిగిపోయాయిలెండి :)"/
మీరు(పైశాచికంగా, లోలోన) సంతోషించారేమో... ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు సంతోషించాలో అర్థంకాక నిర్లిప్తను అలా వ్యక్తం చేశాను. మీ లంబకోణంలోనే అందరూ చూడాలని, నాకు తెలియకుండా లోలోపల ఫత్వాగాని జారీ చేసేశారా ఏంటి?! హమ్మ్... :))
ఇంతటితో.. తరవాతెపుడైనా 'లొల్లుకుందాం', ముందుగా చదివి, సెన్సార్ చేసి, ప్రచురించే శ్రమ బ్లాగర్‌కివ్వడం... 'మంచి గుంటుడు అవుతదా?' :D
Snkr
శంకర్ గారు ఈ బ్లాగ్ లింక్ బజ్ లో షేర్ చేశా , నాగార్జున అక్కడ రెస్పాన్స్ చేసారు , అదీ విషయం :)))
శంకర్ గారు , నాగార్జున మీ ఇద్దరి లో ఎవరికైనా నేను ప్రచురించిన కామెంట్ల తో ప్రాబ్లం ఉంటె దయచేసి చెప్పండి , వాటిని డిలీట్ చేస్తాను .
నాకైతే వుంచినా, తీసివేసినా అభ్యంతరం లేదండి. చెప్పాను, చదివారు .. వాటి పర్పస్ అయిపోయింది :) నాగార్జునగారి మనోభావాలు దెబ్బతిని వుంటే ( అసలే వారి 'గోస వేరు, సంస్కృతి, ఆచారాలు వేరాయె' ఏ అఘాయిత్యం... అమంగళం అప్రతిహతమగుగాక! :D ) నిరభ్యంతరంగా తీసేయండి.
ఏదో మా ఖర్మకాలి కలిసున్నందుకు ఇలాంటి ఆటుపోట్లు తప్పవు. ఆరోజే ఆ బూర్గుల మాగ్గావాలె అనివుంటే ఈ 53ఏళ్ల ఇన్‌స్టాల్మెంట్ల మీద ఏడుపులు, పెడబొబ్బలు వినే పరిస్థితి వుండేది కాదు. మన ఆంధ్ర దేశంలోనే మొదటి స్థానంలో వుండేవేమో.
శ్రావ్యగారు, ఇది మీ బ్లాగు, పోస్ట్ స్పూర్తికి విరుద్దంగా నా వ్యాఖ్యలు ఉన్నాయనుకుంటే వాటిని నిరభ్యంతరంగా తీసేయండి. నాకెలాంటి అభ్యంతరం లేదు.
@snkrగారు:ఫత్వాలు జారీచేసేంత సీను, గొప్ప ఆలోచనా నాకులేవుగాని అవసరంలేని చోట సంబధంలేని పనిచేయొద్దనే అభిప్రాయం మాత్రం ఉంది. ఒకవేళ బ్లాగ్ ఓనర్ మీరనుకున్నట్టు ప్రస్తుత పరిస్థితి చక్కదిద్దేందుకు action plan రూపొందించాలనే ఉద్దేశ్యంతోనే పోస్ట్ వేసారు అనుకుంటే చెప్పంది మీరనుకునె ముసుగులోనే మారుమాట్లాడకుండా వెళ్ళిపోతా.
>>’విరోచన’కారుల సానుభూతి పరులు
అసలు ఏ ప్రాతిపదికమీద ఈ మాటన్నారో తెలుసుకోవచ్చా. ఇన్నిరోజులు ఒప్పనిపించిన పోస్టులు మెచ్చుకున్నా, తప్పు అనిపించినపుడు-వీలైనపుడు ఎంతోకొంత ధైర్యం తెచ్చుకొని అదేమాట చెప్పా అంతేకాని గుడ్డిగా ఎవరినీ సమర్ధించిన రోజులు లేవు- కనీసం నా అనుకోలులో.మీరు దయచేసి ఆ వివరాలేవో ఇస్తే నాగురించి ఇంకాస్త తెలుసుకుంటా.
>> గోస వేరు, సంస్కృతివేరు
అలాగా...నేనింకా తెలుగువాడిగా భావించుకొని *నా ఆం.ప్ర* కు సరిపోవనే మాటలు కనిపిస్తే అదే చెప్పాను. తప్పైపోయింది.
>>ఖర్మకాలి కలిసున్నందుకు...దేశంలోనే మొదటిస్థానంలో వుండేదేమో
*ఆటుపోట్లు* భరిస్తూ వేరొకరి/అందరి బాగు కోసం చేసిన BIG help కు చాలాఆఆ థాంక్స్
ఈ పోస్ట్‌కు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనిప్పిస్తుంది, ఈసారి ఇంకెక్కడైనా లొల్లుకుందాం.
..nagarjuna..
/అవసరంలేని చోట సంబధంలేని పనిచేయొద్దనే అభిప్రాయం మాత్రం ఉంది./
పని చేయకుండ, పనిదొంగ కావాలనే ఉద్దేశ్యాలు నాకేకోశానా లేవు. కష్టమో, నిష్టూరమో, చావో-రేవో, ఇచ్చుడో-చచ్చుడో, గెలుపో-ఓటమో... పని మాత్రం ఎగగొట్టకూడదనేది నా అభిప్రాయం. పనిగండం వుంటే అది వేరే విషయం. పని మాత్రం ఆగరాదు, ఆగ కూడదు. "పని చెయ్, ఫలితాన్ని భగవదార్పణంగావించు" అనే కృష్ణుడి భోధనల్లో తిరుగులేని సత్యం వున్నదని నమ్ముతాను. ;) :))
అవసరం లేని చోట, ఇక్కడ వాడకపోయినా, "తెలబాన్లు" అనే పదాన్ని గుర్తుచేస్తూ, తెలబాన్ల మనోభావాలు దెబ్బతీశారెందుకు? విగ్రహాలు కూలదోసి, 'త్రిరగనీయం' అని ఫత్వాలు జారీచేసినంత మాత్రాన, 'లొల్లికారులను' (పదం బాగుంది కదూ) 'తెలబాన్లు' అని సంభోధిస్తే మనోభావాలు దెబ్బతిని దీచ్చలు చేసి, రోడ్లమీద తిని, దొర్లి, ఆటా-పాటా అని నానాయాగీ చేస్తారని మీరూహించక పోవడం శోచనీయము. :)
సరే... మంచివారులా వున్నారు, మీ మాట దృష్టిలో వుంచుకుంటాను. cheers!
శంకర్ గారు...మీ మొదటి కామెంట్ kevvvvvvvvvvvv :D
శ్రావ్య గారు - ఎప్పుడో స్కూల్ లో పాడుకున్న పాట..తరువాత వినలేదు...!!చాలా మంచిగా అనిపించింది...వింటుంటే..
ఆవిడ కూడా ఫీల్ అవుతూ పాడారు..అందుకని ఇంకా నచ్చింది :)..థాంక్స్ ఫర్ sharing :)
కిరణ్ మీకు నచ్చినందుకు థాంక్స్ !
యీ (మీ) బ్లాగ్ ఎంత బాగుందో!!!నేను ఇదే చూడ్డం....
ఎన్నెల
ఎన్నెల గారు థాంక్ యు !
Post a Comment