నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు


నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమైతానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మయై యుండు సం-
స్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు||        ||నిత్యాత్ముడై యుండి||
యేమూర్తి లోకంబు లెల్ల నేలెడు నాత
డే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత
డే మూర్తి నిజమోక్ష మియ్యజాలెడు నాత
డే మూర్తి లోకైక హితుడు||               ||నిత్యాత్ముడై యుండి||
యే మూర్తి నిజమూర్తి యేమూర్తి యునుగాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైన యాత
డేమూర్తి సర్వాత్యుడేమూర్తి పరమాత్ము
డామూర్తి తిరు వేంకటాద్రి విభుడు||       ||నిత్యాత్ముడై యుండి|
|
యేదేవు దేహమున నిన్నియును జన్మించె
నేదేవు దేహమున నిన్నియును నఱగెమరి
యేదేవు విగ్రహంబీ సకల మింతయును
యేదేవు నేత్రంబు లిన చంద్రులు||         ||నిత్యాత్ముడై యుండి||
యేదేవుడీ జీవులన్నింటిలో నుండు
నేదేవు చైతన్య మిన్నిటికి నాధార
మేదేవుడవ్యక్తుడే దేవుడద్వంద్వుం
డాదేవుడీ వేంకటాద్రి విభుడు||            ||నిత్యాత్ముడై యుండి||




భో శంభో శివ శంభో స్వయంభో


భో శంభో శివ శంభో స్వయంభో

గంగాధర శంకర కరుణాకర
మామవ భవసాగర తారక
భో శంభో శివ శంభో స్వయంభో

నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
గమగమ భూత ప్రపంచ రహిత
నిజపుర నిహిత నితాంతనంత
ఆనంద అతిశయ అక్షయలింగ  
భో శంభో శివ శంభో స్వయంభో

ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం 
తోం తోం తిమికిట తరికిట కిటతోం 
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంబర వేష్టితవేష
నిత్య నిరంజన నిత్యనటేశ   
ఈశ సభేశా  సర్వేశా 
భో శంభో శివ శంభో స్వయంభో


Mohe Rang Do Laal.....


Mohe rang do laal
Mohe rang do laal
Nand ke lal laal
Chedo nahin bas rang do lal
Mohe rang do laal


Dekhoon dekhoon tujhko main hoke nihal
Dekhoon dekhoon tujhko main hoke nihal
Choo lo kora mora kanch sa tan
Nain bhar kya rahe nihar

Mohe rang do laal
Nand ke lal laal
Chedo nahin bas rang do lal
Mohe rang do laal


Marodi kalayi mori
Marodi kalayi mori
Haan kalayi mori
Haan kalayi marodi, kalayi mori
Choodi chatkayi itraayi
To chori se garwa lagayi

Hari yeh chunaria
Jo jhatke se chhini
Hari yeh chunaria
Jo jhatke se chhini
Main to rangi hari hari ke rang
Laaj se gulabi gaal

Mohe rang do laal
Nand ke lal laal
Chedo nahin bas rang do lal
Mohe rang do laal

Mohe rang do laal
Singers: Shreya Ghoshal, Pandit Birju Maharaj
Music: Sanjay Leela Bhansali
Lyrics: Siddharth-Garima

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ


ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ
ఏమో...
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో...


ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ
ఏమో...
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో...


సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో !
స్వరం లేని ఏ రాగంతో  చెలిమికెలా స్వాగతమందో !
ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో !
మనం అనే కథానిక మొదలైందో


ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ
ఏమో...
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో...


ఒక్కొక్క రోజుని ఒక్కోక్క  గడియగ కుదించ  వీలవక
చిరాకు పడేట్లు పరారైంది  సమయం  కనపడక !
ప్రపంచమంతా పరాభవంతో తలొంచివెళ్ళిపోదా
తనోటి ఉందని మనం ఏలాగ గమనించం గనక !
కలగంటున్న మెలకువలో ఉన్నాం కదా
మనదరికెవ్వరు వస్తారు కదిలించగ !
ఉషస్సేలా ఉదయిస్తోందో  నిశీధెలా ఎటుపోతుందో ..
నిదుర ఎప్పుడు నిదురోతుందో..
మొదలు ఎలా మొదలయ్యిందో..
ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో...
మనం అనే కథానిక మొదలైందో...


ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ
ఏమో...
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో...



పెదాల మీదుగా అదేమీ గల గల పదాల మాదిరిగా ..
సుధలని  చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా..
ఇలాంటివేళకు ఇలాంటి ఊసులు  ప్రపంచభాష కదా..
ఫలాన  అర్ధం  అనేది  తెలిపే నిఘంటవుండదుగా..
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా  వినబోతున్న సన్నాయి మేళాలుగా..


ఓ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో...
స్వరం లేని ఏ రాగంతో  చెలిమికెలా స్వాగతమందో...
ఇలాంటివేం  తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో...
మనం అనే కథానిక మొదలైందో ... 


ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ
ఏమో...
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో...


Where the mind is without fear !


Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit

Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.


                                                   'Viswakavi' Rabindranath Tagore (Geethanjali)


ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో ,
సంసారపు గోడల మద్య
ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో,

ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరుగని శ్రమ
తన భాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో
స్వచ్చమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో,

ఎక్కడ మనసు
నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛ స్వర్గానికి,
తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.

                                                               ( 'చలం ' అనువాదంలో విశ్వకవి గీతాంజలి )

దేవ దేవం భజే దివ్యప్రభావం


తీరిన మనోగతం అందెను పాశుపతం !!!!!!  
పాశుపతం ???   బాబోయ్ ఇదేంటి  ఎప్పుడో  గూగుల్ ప్లస్ పోస్ట్ లో కోరుకున్న చిరు  కోరిక అనుకోకుండా తీరటంతో ఏవేవో  అతిశయోక్తి అలంకారాలు వచ్చేస్తున్నాయి నా  కీ బోర్డ్ కి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి  ఈ చీప్ కామెడీ కి  సంబంధం లేదు కాబట్టి కాసేపు ఈ కామెడీ పక్క పెట్టి అసలు విషయం చెప్పేస్తాను. 

***

'అత్తారింటికి దారేది'  మూవీ ఆడియో రిలీజ్ అయిన రోజుల్లో,   'దేవ దేవం భజే'  అనే  అన్నమాచార్య వారి కీర్తన విని,    ఇంత అందమైన కీర్తన మంచి క్లాసికల్ డాన్సు బాలే తో చూస్తే అందగత్తె మరింత వన్నెలద్దుకున్నట్టుగా ఉండదూ అనుకున్నాను.  అప్పటి నుంచి ఆ పాటని లూప్ లో పెట్టి వేల సార్లు వినే ఉంటాను, కానీ మంచి క్లాసికల్ డాన్సు చూడాలన్న కోరిక మాత్రం తీరలెదు. 

ఇప్పుడు..  ఇన్ని..  రోజుల తరవాత, దేవుడి దగ్గర సర్వ జనుల కోరికల చిట్టాలో నా కోరిక వంతు వచ్చినట్లుంది. అంతే,  హైదరాబాద్ లో జరుతున్న 'Silicon Andhra International Kuchipudi Dance Convention' లో  శోభా నాయుడి గారి disciples తో ఈ అద్భుతమైన డాన్సు  బాలే ప్రదర్శించారు. 

ఈ magnificent performance ని వర్ణించటానికి ఏ అలంకారాలు వాడినా మాటల్లో పెట్టటం కష్టం అందుకే నేను ఆ పని చేయకుండా  ఆ బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ ఈ వీడియో లో  చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను.   శోభానాయుడు గారికి, వారి శిష్యులకి మెనీ థాంక్స్.


(కేవలం చివరి చరణం ఒక్కటే తీసుకుని ఈ  డాన్సు compose చేసారు, పూర్తిగా వినాలంటే క్రింద MS సుబ్బులక్ష్మి గారి గొంతు నుంచి జాలువారిన అమృతధారల్లొ తడిచిపోవచ్చు)


పల్లవి:
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం
 

 చరణము -1:
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ
దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం
 

చరణము -2:
నీలజీమూత సన్నిభశరీరం ఘనవి
శాలవక్శం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం

చరణము -3:
పంకజాసన వినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం

పూర్తిగా MS సుబ్బులక్ష్మి గారి heavenly వాయిస్ నుంచి.. 

యాకుందేందు తుషార హార ధవళా ....



యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రా వృతా 
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా !
యా బ్రహ్మచ్యుత శంకర ప్రభ్రుతి భిర్దే వై సదా పూజిత
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యా పహా !!