గాన గంధర్వుడు

జేసుదాస్ (K.J .యేసుదాస్) ఈ పేరు వినగానే   ఒక అమృతధారలు కురిపించే ఒక గళం  మన కళ్ళ ముందు అలా కదలాడుతుంది కదా . జేసుదాస్ గా మనందరికీ  తెలిసిన శ్రీ  కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ గారి పుట్టిన రోజు ఈ రోజు (జనవరి 10 ). ఆయన గురించి ఒక  బ్లాగు పోస్టు లో వ్రాసి  కొండని  అద్దం లో  చూపించే   సాహసం నేను చేయను కాని,   ఈ  గాన గంధర్వుడు  పుట్టినరోజు సందర్భం గా   ఆ గళం నుంచి పొంగిన  అద్భుతమైన  స్వర రాగ గంగా ప్రవాహం లో తడిచి    మనస్ఫూరిగా శుభాకాంక్షలు అందించాలి అని నా చిన్న ప్రయత్నం .

ఆయన స్వరాన్ని విని మైమరచిపోయి మనతో తన అనుభవాలు పంచుకున్న సుజాత గారి మనస్సులో మాటలు ఇవి !

సాగర తీర సమీపాన తరగని కావ్య సుధామధురం అంటూ వేణు గారు మనతో పంచుకున్న మరో మంచి పాట ఇక్కడ .

మన నెమలికన్ను మురళి గారు పంచిన ముచ్చట్లు ఇక్కడ 

పద్మ శ్రీ , పద్మ భూషణ్ లతో పాటు అనేక  గౌరవ పుర స్కారాలకి  వన్నె తెచ్చిన  ఈ అమృత  గాయకుడి కి   మరిన్ని గౌరవ పురస్కారాలు  దక్కాలని   కోరుకుంటూ  మనస్పూర్తి గా  జన్మదిన శుభాకాంక్షలు !