మా తెలుగుతల్లికి మల్లెపూదండ


ఈ పాట పాడిన గాయని గురించి తెలియని నవతరం  యువతి యువకులారా ఇక్కడ చదివి తెలుసుకోమని మనవి :)

మా తెలుగుతల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
                                                                 ।।మా తెలుగు।।
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
                                                                  ।।మా తెలుగు।।

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!
                                                    
                                                                  -- శ్రీ  శంకరంబాడి సుందరాచారి.

క్షీర సాగర శయన నన్ను చింతల పెట్ట వలెనా


పల్లవి
క్షీర సాగర శయన నన్ను చింతల పెట్ట వలెనా రామ
అనుపల్లవి 
వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది విన్నానురా రామ  !!క్షీ!!
చరణం 
నారీ మణికి చీరలు-ఇచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామదాసుని బంధము తీర్చినది విన్నానురా
నీరజ-అక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా

తారక నామ త్యాగరాజ నుత దయతోను-ఏలుకోరా రామ    !!క్షీ!!

                           

                                                                               రాగం  - దేవగాంధారి
                                                                               శ్రీ త్యాగరాజ విరచితం  
           


Kshirasaagara Shayana ! Nannu  Chintala Betta Valena? Rama!

Vaarana Raajunu Brovanu Vegame
Vacchinadi Vinnaanuraa Rama!

Naarimaniki Jiralicchinadi
Nade Ne Vinnaanura
Chirudau Ramadaasuni Bandhamu
Dirchinadi Vinnanuraa
Nirajaakshikai Niradhi Daatina
Ni Keerthini Vinnanuraa
Taarakanaama Tyagaraajanuta!
Dayato Neelukoraa Rama!

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ



జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి

జయ జయ సశ్యామల సు శ్యామచలా  చేలాంచల
జయ జయ సశ్యామల సు శ్యామచలా  చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి 

దివ్యధాత్రి దివ్యధాత్రి దివ్యధాత్రి 
దివ్యధాత్రి  దివ్యధాత్రి  దివ్యధాత్రి 

                           రచన : శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి



                                                      (Credits : Oringal Video owner & uploader)

Nee Nenaindal Agadadum Undo



ft. Vidya and Vandana Iyer - Shankar Tucker
Composed by Periasamy Thooran
Raga - Darbari Kanada (Hindustani)

(Tamil lyrics in English script)

Nee Nenaindal Agadadum Undo
Nee Nenaindal Agadadum Undo
Nirajadala Nayani Mahalaksmi

Nee Nenaindal Agadadum Undo

Manida Vazhkkaiyile Inba Tunbam
Manida Vazhkkaiyile Inba Tunbam
Manida Vazhkkaiyile Inba Tunbam
Mari Mari Varuvadum Un Seyal Andro

Manida Vazhkkaiyile Inba Tunbam
Mari Mari Varuvadum Un Seyal Andro

Nee Nenaindal Agadadum Undo
Nirajadala Nayani Mahalaksmi

Nee Nenaindal Agadadum Undo

Ella Perumaigalum Irundalum Adhu
Unnadi Vanangamal Nilai Perumo

Ella Perumaigalum Irundalum Adhu
Unnadi Vanangamal Nilai Perumo
Unnarul Parvai Illadavarkku
Unnarul Parvai Illadavarkku
Ulagile Vazha Vazhiedhu Amma

Unnarul Parvai Illadavarkku
Ulagile Vazha Vazhiedhu Amma

Nee Nenaindal Agadadum Undo
Nirajadala Nayani Mahalaksmi

Nee Nenaindal Agadadum Undo


(Meaning in English )

Once You have determined
That it be so
Is there anything in the Universe
That cannot happen thence,
O lotus-eyed Goddess Mahalakshmi?


In man’s life is pleasure
In man’s life, pain
Turns do they take to metamorphose
All by Your will and Your doing alone


Even if we have with us
All the sucesses in the world
How oh how will we retain them,
Without worshiping Your divine feet?


And those beings on whom
Your benevolent gaze does not fall
How else can they live in this world,
O Mother of all?

నమ్మకు నమ్మకు ఈ రేయిని

చిత్రం: రుద్రవీణ
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం: యస్ పి బాలసుబ్రమణ్యం.


సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటియెచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటిముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దుపొడుపే లేని సీకటే ఉండిపోనీ మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటేనకా

నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికీ
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది

నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహ నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

శీతాకాలంలో ఏ కోయిలైనా - రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైనా - రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవ్వరికీ చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద

నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహ నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని



సామజ వరగమన ..........!

సామజ వరగమన
సామజ వరగమన సాధుహృ సామజవరగమన
సాధుహృ సామజ వరగమన
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన

సామనిగమజ సుధా
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామనిగమజసుధామయ గాన విచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామని గమజసుధామయ గాన విచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామజ వరగమన సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత! విఖ్యాత సామజ వరగమన

వేదశిరోమాతృజ సప్తస్వర నాదా చలదీప స్వీకృత
వేదశిరోమాతృజ సప్తస్వర నాదా చలదీప స్వీకృత
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ
వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ
వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
యాదవకుల మురళీ
కుల మురళీ
వాదన వినోదమోహనకర త్యాగరాజవందనీయ
సామజవరగమన

సామజ వరగమన సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత విఖ్యాత సామజవరగమన

త్యాగరాజ విరచితమైన ఈ కృతి అమృతధారలు కురిపించే ఏసుదాస్ గారి గొంతులో ...



అద్భుతమైన వీణా విన్యాసం లో



రాజేష్ వైద్య వీణా వాదన


Saxophone






పిల్లలూ మీ కోసం మాత్రమే.....................!

పిల్లలు సూర్య , అనఘ , సంకీర్తన ఈ రోజు ఈ బ్లాగు అచ్చు మీ కోసం . రండి రండి మంచి పాటలు చూసేద్దాం , పాడేద్దాం :)
సరదా గా పిల్లలకి మాత్రమే అని చెప్పినా మీరు కూడా చూడచ్చులెండి మరీ మొహాలు అలా మాడ్చేసుకోకండి .
ఏమి పాటలో చెప్పెయనా ? ఆశ, దోశ, అప్పడం , వడేమీ కదూ :) ఈ మొదటి రెండు నిమషాలా టైటిల్ సాంగ్ చూస్తే మీకే తెలిసి పోతుంది ఏమి పాటలో :)

బావున్నాడు కదూ అప్పుడే పుట్టిన మన బుజ్జి బ్లూ గాడు !మన పిరికి బుజ్జి బ్లూ గాడు హీరోయిన్ దొరికే సరికి చూడండి ఎలా పాడేస్తున్నాడో I wanna party అనుకుంటూ .

పాపం ఎగరటానికి మన బ్లూ పడే కష్టాలు ఇక్కడ చూడండి .


ఇక చివరి గా తప్పక చూడాల్సిన Rio కార్నివాల్ .


గత సంవత్సరం విడుదల అయిన సినిమాల్లో నాకు నచ్చింది Inception , ఈ సంవత్సరం ఇప్పటి వరకు నేను చూసిన సినిమాల్లో నాకు నచ్చినది "RIO " మీరు ఈసారికి చూసి ఉండొచ్చు , ఒకసారి వీడియోలు చూసి సినిమా ని గుర్తు చేసుకొని ఆనందించండి .

ఖరహరప్రియ రాగం

ఖరహర ప్రియ రాగాన్ని కర్నాటక సంగీతానికి మహారాణి గా వర్ణిస్తారు . ఈ ఖరహరప్రియ రాగం లో కూర్చిన కొన్ని పాటలు విందామా !

స్వాతి కిరణం నుంచి


సంగీత సాహిత్య సమలంకృతే
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే

హే భారతీ మనసా స్మరామి
హే భారతి మనసా స్మరామి
శ్రీ భారతీ శిరసా నమామి
శ్రీ భారతి శిరసా నమామి
సంగీత సాహిత్య సమలంకృతే……….

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిణి
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిణి
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞ్యానవల్లీ సవుల్లాసిని.......

సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే……….

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి ....
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని

సకల సు కళా సమున్వేషిణి
సకల సు కళా సమున్వేషిణి
సర్వ రస భావ సంజీవినీ

సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతీ మనసా స్మరామి
శ్రీ భారతీ శిరసా నమామి
సంగీత సాహిత్య సమలంకృతే……….




అభేరీ రాగం (ఖరహరప్రియ జన్యరాగం ) లో చేసిన ఈ పాట ను మురిపించే మువ్వలు సినిమా కోసం జానకి గారు పాడారు. ఈ వీడియో లో చిట్టితల్లి కూడా అంత కష్టమైన పాటని ఎంత ముచ్చట గా పాడిందో చూడండి .


ఎప్పుడు చూసిన పాత పాటలేనా హు అనుకునే కొత్త పాటల ప్రియుల కోసం ఖరహర ప్రియరాగం లోనే చేసిన ఈ పాట



(Credits : Original video uploaders)

ఇదే రాగం లో చేసిన మరికొన్ని పాటలు నెక్స్ట్ పోస్టులో విందాం , అందాకా ఉంటూనే ఉండండి మీకు నచ్చిన పాటలు ఈ మన బ్లాగులో ........................:)

కృష్ణా నీ బేగనే బారో.........

చిన్ని కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తూ , కృష్ణుడిని రమ్మని పిలిచే వ్యాసతీర్థుల వారు రచించిన ఈ కన్నడ సంకీర్తన యేసుదాస్ గారి గొంతులో ఎంత హృద్యం గా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకుందామా ! మరీ ముఖ్యం గా "నీ బెగనే బారో " ఇక్కడ బారో అని పలికేచోట ఆయన గొంతులోని మాధుర్యం విని తీరాల్సిందే .

(కదిరి వారి సాక్సఫోన్ లో ఇక్కడ , షేక్ చిన్నమౌలానా వారి నాదస్వరసుస్వరం లో ఇక్కడ వినవచ్చు .)
(Credits : Original Video uploders )





(దక్షిణ భారత నైటింగేల్ చిత్ర గారి గొంతు లో )




(ఇక 1990 లలో కొలొనియల్ కజిన్స్ పేరుతో ఉర్రూతలూగించిన ఆల్బం నుంచి హరిహరన్, లెస్లీ లూయిస్ స్వరాల్లో)




తెలుగు లిరిక్స్ కోసం:మోహనరాగాల పద్మగారు


(Lyrics)
Krishna nee begane baaro

Krishna nee begane baaro
begane baro mukhavanne toro
Krishna nee begane baarO


Kalalandige gejje neelada bavuli
Neelavarnane naatyava naduta baaro
Krishna nee begane baarO


Odiyalli udugejje beralalli ungura
koralallu haakida vaijayantimaale
krishna nee begane baarO


Kaasi peetambara kaiyalli kolalu
Pushida shreegandha ma yyala giralu
Krishna nee begane baarO



Taayige baayalli jagavanne torida
Taayige baayalli jagavanne torida
jagadhOdhaaraka namma Udupi Shree Krishna


Krishna nee begane baaro
Begane baro mukhavanne toro
Krishna nee begane baarO

వాతాపి గణపతిం !

నాకు నచ్చిన సంగీతాన్ని ఇక్కడ పొందుపరిచటానికే నా చిన్న ప్రయత్నం !








Credits : Orginal Video Uploader