చిత్రం: రుద్రవీణ
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం: యస్ పి బాలసుబ్రమణ్యం.
సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటియెచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటిముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దుపొడుపే లేని సీకటే ఉండిపోనీ మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటేనకా
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికీ
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహ నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
శీతాకాలంలో ఏ కోయిలైనా - రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైనా - రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవ్వరికీ చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహ నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం: యస్ పి బాలసుబ్రమణ్యం.
సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటియెచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటిముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దుపొడుపే లేని సీకటే ఉండిపోనీ మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటేనకా
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికీ
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహ నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
శీతాకాలంలో ఏ కోయిలైనా - రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైనా - రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవ్వరికీ చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహ నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
6 comments :
ఈ పాట చాలా బావుంటుంది ముఖ్యం గా starting ఇంకా బావుంటుంది..సిరి వెన్నెల \m/ :))))
హరేకృష్ణ మీకు ఇష్టమా ఈ పాట Glad to know that, Thank you !
'ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను'
ఇదే సందేశాన్ని తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎన్ని పాటల్లో రాశారు. అయినా ఈ పాటలో ఎంత కొత్తగా అనిపిస్తోంది కదా.. విద్వత్తు వున్నవాడు తన విద్యను ఎప్పుడూ వినూత్నంగా ప్రదర్శిస్తాడు అనడానికి 'సిరివెన్నెల' చక్కని ఉదాహరణ.
చాణుక్య మీ కామెంట్ చాలా నచ్చింది ! అవును , సిరివెన్నెల "విద్వత్తు వున్నవాడు తన విద్యను ఎప్పుడూ వినూత్నంగా ప్రదర్శిస్తాడు " దీనికి చక్కని ఉదాహరణ . ఈ పాట లో అందమైన సాహిత్యాన్ని చప్పుళ్ళ మధ్య కలిసి పోకుండా దానికి తన సంగీతం ద్వారా ప్రాణం పోశారు ఇళయరాజా , ఇక బాలు సంగతి చెప్పనక్కర్లేదు . అలాగే నాకు నచ్చిన మొదటి ఐదు చిరంజీవి సినిమాల్లో ఇది ఒకటి .
నాకు నచ్చిన నంబర్‌వన్ చిరంజీవి సినిమా ఇది. ఇందులో బాలు పాడిన పాటలన్నీ ఒక ఎత్తు. జేసుదాసు లలితప్రియ కమలం ఒక ఎత్తు. ఇద్దరూ ఇద్దరే..
నేను చెవి, ముక్కు, గొంతు ఇంకా ఇతరత్రా భాగాలు కూడా కోసుకునే శంకరాభరణం, స్వాతికిరణం పాటలు కూడా ఇస్తే చక్రవర్తి గారు ప్రసన్నులు అయి తమ ఆస్థానంలో మీకు సముచిత గౌరవం కల్పిస్తారు. ఎవరక్కడ..?
భటుడు: ఎవరూ లేరు. పని చూస్కోవోయ్.
హ హ ఇస్తాం ఇస్తాం :)))
Post a Comment