స్వర రాగ గంగా ప్రవాహమే

 సంగీతానికి  హీల్ చేసే  గుణం  ఉంది అంటారు కదా , ఈ  స్వర రాగ  గంగ ప్రవాహాన్ని  విన్న ప్రతిసారీ  అది ఎంత  నిజం  అనుకుంటూ ఉంటాను .  మరి నాతొ పాటు మీరు విని  ఆనందించండి .


ప్రవాహమే గంగా ప్రవాహమే ....

స్వర రాగ గంగా ప్రవాహమే 
అంగాత్మ సంధాన యోగమే   
ప్రాప్తే వసంతే త్రికాలికే 
పలికే కుహు గీతికా 
గాన సరసీరుహమాలికా        !! స్వర రాగ !!

గమపని గమపని గమపని గమపని 
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసగ సగసని సనిపమ పమగమ గ


కొండల లోపల నిండిన నింగిలో 
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి 
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో 
కురిసెను రాగం ఈనాటికి 
మట్టింటి రాయే మాణిక్యమైపోయె
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా 
ఆ గంగ పొంగింది లోన          !! స్వర రాగ !!

సని సని సగగస గసగస పమపమ 
మగమగ పమపమ నిసనిప సనిసని 


చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి 
వినిపించు రాగాలనంతాలులే 
ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు  
జగమంత విహరించు రాగాలులే 
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు 
పులకింతలా పుష్యరాగాలులే 
మలిసందె దీపాలు గుడిగంట నాదాలు 
మౌనాక్షరీ గాన వేదాలులే     !! స్వర రాగ !!

                                     

7 comments :

జ్యోతి said...

నిజంగా ఈ పాట విన్నప్పుడు ఒకలాంటి vibration ఫీల్ అవుతాను. ఇది సంగీతమో, సాహిత్యమో, జేసుదాస్ స్వరంలోని శక్తో తెలీదు. disturbed గా ఉన్నప్పుడు పదేపదే రిఫ్రెష్ చేసి వింటాను. మళయాలంలో ఈ పాట విన్నారా??

సుజాత వేల్పూరి said...

ఆ సాహిత్యం ఎంత బాగుందో చూడండి! అద్భుతం! నటించిన వాడిని గుర్తుకు తెచ్చుకోకుండా వినాలి! అప్పుడు ఇంకా అద్భుతం

Sravya V said...

జ్యోతి గారు అవునండి , నేనైతే ఎక్కువ క్రెడిట్ ఏసుదాస్ గారి స్వరానికే ఇస్తాను :)) మలయాళం లో చూసానండి కానీ తెలుగే ఎక్కువ నచ్చింది నాకు ! మీ అనుభూతి ని పంచుకున్నందుకు థాంక్ యు జ్యోతి గారు !

అద్భుతం! నటించిన వాడిని గుర్తుకు తెచ్చుకోకుండా వినాలి!
----------------------------------------
సుజాత గారు అవునండి :) థాంక్ యు !

శేఖర్ (Sekhar) said...

Ur blog got handpicked gems.

Thanks

Sravya V said...

Sekhar gaaru Thank you !

Vasu said...

చక్కోరాలు -> చకోరాలు .. బహుశా ఏసుదాస్ అలా పాడి ఉంటారు.. కొన్ని పదాలు మరీ నొక్కి పలుకుతారు కదా ఆయన ..

వేటూరి గారు ఈ పాట గురించి ఒక చిన్న సైజు వ్యాసం రాసారు కొమ్మ కొమ్మకో సన్నాయి లో .. ఆయనకి బాగా తృప్తిని ఇచ్చిన పాటల్లో ఇదొకటి అనుకుంటా .

కానీ మీరు ఎక్కువ క్రెడిట్ ఏసుదాస్ కి ఇచ్చేసారు కదా :(

Sravya V said...

@వాసు గారు కరెక్ట్ చేసానండి, చాలా థాంక్స్ !
హ హ అవునండి అంటే కొంచెం యేసుదాస్ గారంటే పక్షపాతం, అది అలా చేయించేసింది :-)

Post a Comment