కన్నులతో చూసేదీ ......

కన్నులతో  చూసేదీ గురువా కన్నులకు  సొంతమౌనా కన్నులకు సొంతమౌనా
కన్నుల్లో  కను  పాపై నీవు  కన్ను  విడి  పోలేవూ ఇక  నన్ను  విడి  పోలేవు


జలజల జలజల   జంట  పదాలు గలగల గలగల జంట పదాలు ఉన్నవిలే  తెలుగులో  ఉన్నవిలే
విడదీయుటయే  న్యాయం  కాదు విడదీసేస్తే  వివరం  లేదు రెండెలే  రెండూ  ఒకటేలే !


రేయి  పగలు  రెండైనా రోజు  మాత్రం ఒకటేలే
కాళ్ళు  ఉన్నవి రెండైనా  పయనం  మాత్రం  ఒకటేలే
హృదయాలున్నవి  రెండైనా   ప్రేమ  మాత్రం  ఒకటేలే !


కన్నులతో  చూసేదీ గురువా కన్నులకు  సొంతమౌనా కన్నులకు సొంతమౌనా

క్రౌంచపక్షులు  జంటగ పుట్టును  జీవితమంతా  జతగా బ్రతుకును విడలేవూ  వీడి  మనలేవూ
కన్నూ  కన్నూ  జంటగ  పుట్టును  ఒకటేడిస్తే రెండోదేడ్చును పొంగేనా  ప్రేమే చిందేనా


ఒక్కరు  పోయే  నిద్దురలో  ఇద్దరు కలలను కంటున్నాం
ఒక్కరు  పీల్చే  శ్వాసలలో ఇద్దరి  జీవనమంటున్నాం
తాళి   కొరకు  మాత్రమే  విడి  విడిగా  వెదుకుతున్నాం


కన్నులతో  చూసేదీ  గురువా ...

కన్నులతో  చూసేదీ గురువా కన్నులకు  సొంతమౌనా కన్నులకు సొంతమౌనా
కన్నుల్లో  కను  పాపై నీవు  కన్ను  విడి  పోలేవూ ఇక  నన్ను  విడి  పోలేవు.


4 comments :

వేణూశ్రీకాంత్ said...

మంచిపాట పోస్ట్ చేశారు. ఆ రెండో చరణంలో చివరిలైన్
"దాని కొరకు మాత్రమే విడి విడిగా బ్రతుకుతున్నాం"
కాదు
"తాళి కొరకు మాత్రమే విడి విడిగా వెదుకుతున్నాం"

Sravya V said...

@Venu gaaru, corrected :-) Thank you very much !

Karthik said...

Sravya gaaru mee posts anni chaalaa baagunnayi:-):-)

Sravya V said...

@ఎగిసే అలలు గారు థాంక్ యు :-))

Post a Comment